ఈనెల 20న జిల్లాకు జూపల్లి రాక

ASF: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 20న ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించి, అనంతరం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.