అల్పపీడనం ఎఫెక్ట్.. భారీ వర్షాలు

VSP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ బుధవారం తెలిపారు. దీని ప్రభావంతో రాగల 5 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏలూరు, పశ్చిమగోదావరి, నెల్లూరు, కృష్ణా జిలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.