పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్
నెల్లూరు రూరల్ పరిధిలోని గుడిపల్లిపాడులో నగర కమిషనర్ వై.వో నందన్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి, మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ వసూళ్లపై సమీక్ష నిర్వహించి, లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యటనలో ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.