VIDEO: కల్తీ పాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీ
అనంతపురం నగరంలోని పలు ప్రధాన కూడళ్ల వద్ద విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని రోడ్డు మీద, షాపుల్లో పాలు అమ్మే వారిపై పక్క ప్రణాళికతో దాడులు చేశారు. వారి నుంచి పాలు షాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కల్తీ చేసినట్లు రుజువు అయితే పాలు అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని విజిలెన్స్ అధికారులు తెలిపారు.