అంధుల మహిళల క్రికెట్ జట్టును కలిసిన మోదీ

అంధుల మహిళల క్రికెట్ జట్టును కలిసిన మోదీ

తొలిసారి నిర్వహించిన అంధుల మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత జట్టును ప్రధాని మోదీ కలిశారు. ఈ సందర్భంగా ప్లేయర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం సమష్టితత్వం, అంకితభావానికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రతీ క్రీడాకారిణి ఒక ఛాంపియన్ అని.. ఈ ఘనత రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.