'రైతులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
SRCL: రైతులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. రైతులు ప్రస్తుతం ధాన్యం, పత్తి విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో ఖాతాల్లో ఉన్న డబ్బులు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు.