ఎడ్యుకేషన్ వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తులు

ASR: పాడేరు, కొయ్యూరు, జీ.మాడుగుల మండలాల్లో పాఠశాలలు లేని 10 మారుమూల గ్రామాల్లో నాన్ రెషిడెన్సియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు బుధవారం తెలిపారు. ఆయా సెంటర్లలో వాలంటీర్లుగా 9నెలల కాలపరిమితితో పనిచేసేందుకు ఈనెల 16లోగా ధరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు దరఖాస్తులను పాడేరు డీఈవో కార్యాలయంలో అందించాలన్నారు.