విద్యార్థులు నరకంలో ఉన్నారు: రంజిత్ కుమార్
GDWL: నెట్టెంపాడు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎనిమిది మంది ఉండాల్సిన చోట కేవలం నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. బాత్రూమ్ లేక విద్యార్థులు ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం అని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా ఛైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ ఇవాళ మండిపడ్డాడు.