విజేతలకు బహుమతుల ప్రధానం
KDP: యోగి వేమన విశ్వవిద్యాలయంలో అఖిలభారత విద్యార్థి సమాఖ్య నిర్వహించిన 'స్త్రీ శక్తి దివస్' వక్తృత్వ పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఎంబీఏ విద్యార్థినులను గురువారం విభాగాధిపతి డాక్టర్ పి. సరిత అభినందించారు. ప్రథమ స్థానంలో శ్రీవాణి బంగారు పతకం, ద్వితీయ స్థానాల్లో బి. కావ్య, తులసి వెండి పతకాలు గెలుచుకున్నారు. ఇలాంటి పోటీల్లో అందరూ పాల్గొనాలని డాక్టర్ సరిత విద్యార్థులకు సూచించారు.