హత్యాయత్నం కేసులో నలుగురి రిమాండ్
SRPT: కోదాడ మండల పరిధిలోని అడ్లూరు సర్పంచ్ గువ్వల శిరీష మామ రామకోటయ్యపై హత్యాయత్నం కేసులో నలుగురిని రిమాండ్ చేసినట్లు రూరల్ ఎస్సై సీహెచ్. గోపాల్ రెడ్డి గురువారం సాయంత్రం తెలిపారు. రిమాండ్ చేసిన వారిలో సైదిరెడ్డి, గోపాల్, ఆకుల శ్రీను, రామాంజనేయరెడ్డి ఉన్నా రని పేర్కొన్నారు. పింగళి శ్రీనివాస్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.