'రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'
ATP: పీఏబీఆర్ డ్యాం నుంచి ఏర్పాటైన ధర్మవరం కుడి కాలువకు గండ్లు పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని వైసీపీ నేత ప్రణయ్ రెడ్డి కోరారు. కూడేరు మండలం జల్లిపల్లి వద్ద కాలువకు గండి పడటంతో వరి, వేరుశనగ, చీనీ పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, అధికారులు కాలువను పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.