ప్రకాశం జిల్లాలో 47200 అర్జీల పరిష్కారం

ప్రకాశం: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చిన 47200 అర్జీలను పరిష్కరించినట్లు స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వివరించారు. ఈ మేరకు ప్రజల అర్జీల పరిష్కారంపై ఒంగోలులోని కలెక్టరేట్లలో శుక్రవారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యి, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.