మోదీకి లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే

కులగణన అంశంపై ప్రధాని మోదీకి AICC చీఫ్ మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. కులగణన అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. కులగణనలో తెలంగాణ నమూనాలు అనుసరించాలని సూచించారు. రిజర్వేషన్లకు 50 శాతం పరిమితిని తొలగించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ఆర్టికల్ 15(15)ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.