'కొత్త సంవత్సరంలో మీ అందరి ఆశలు నెరవేరాలి'

WG: భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు క్యాంప్ కార్యాలయంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. పండితులు యామిజాల కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చెప్పారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో మీ అందరి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నానని, మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతమవ్వాలని కోరారు.