ప్రొద్దుటూరు అభివృద్ధికి సహకరించండి: ఎమ్మెల్యే
KDP: వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాలు, కావలసిన నిధులపై చర్చించారు. ఈ సమీక్షలో TDP రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.