సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
కడప ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మాధవి అన్నారు. బుధవారం కడప నగరంలోని 21వ డివిజన్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగర అభివృద్ధికి ఈ సీసీ రోడ్డు ఎంతో కీలకమని అన్నారు.