VIDEO: వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ, ధ్వజస్తంభం ప్రతిష్ట
KDP: ఖాజీపేట మండలంలోని తుడుమలదిన్నె-2 ఎస్సీ కాలనీలో పెద్దమ్మ తల్లి నూతన విగ్రహం, ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం మంగళవారం వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.