అన్ని విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫేలు: కేంద్రమంత్రి

అన్ని విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫేలు: కేంద్రమంత్రి

ఈ ఏడాది చివరి నాటికి అన్ని విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫేలను ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రేపు రాజ్‌కోట్ వేదికగా మరో 11 విమానాశ్రయాల్లో కేఫేలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాజ్‌కోట్, చంఢీఘర్, ఇండోర్, జమ్మూ, పట్నా, అమృత్‌సర్, వారణాసి, గ్వాలియర్, అగర్తలా, జయపుర, లక్నోలలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.