VIDEO: 30 లీటర్ల గుడుంబా ధ్వంసం.. ఇద్దరిపై కేసు నమోదు
ASF: నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని ఆసిఫాబాద్ ఎస్సై కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలం బాబాపూర్లో తనిఖీ చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 22 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 30 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. ప్రజల రక్షణే పోలీసుల బాధ్యత అని అన్నారు.