'సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు తనిఖీ చేసిన కలెక్టర్'

'సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు తనిఖీ చేసిన కలెక్టర్'

PDPL: సమీకృత కలెక్టరేట్‌లోని కార్యాలయాలను జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పాడైపోయిన సామాగ్రి తొలగించాలని తెలిపారు. కార్యాలయాలకు వచ్చే ప్రజల దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించాలని ఆదేశించారు.