రాష్ట్రంలో జిల్లా ముందంజ: కలెక్టర్

SKLM: పీ-4 పథకం అమలులో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. 64,166 బంగారు కుటుంబాలలో 61,552 కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా లక్ష్యం చేరుకున్నామని వెల్లడించారు. దీంతో 1,55,804 లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. కిలోమీటర్ల రహదారులలో వేలాది మొక్కలు నాటమని అన్నారు.