మరో భారీ ప్రాజెక్ట్.. ఎల్లుండే భూమిపూజ
AP: రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఈ నెల 21న మరో చారిత్రాత్మక ఆడుగు పడనుంది. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు దిగ్గజం 'AMNS ఇండియా' నిర్మించే గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటుకు భూమి పూజ జరగనుంది. దీంతో దాదాపు లక్షమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశం లభించనుంది. ఈ కార్యక్రమంలో CM చంద్రబాబుతోపాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొననున్నారు.