కళాశాల భవనాలను ప్రారంభించిన వరదరాజుల రెడ్డి

KDP: ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డులో నిర్మించిన దేవరశెట్టి ఆదిలక్ష్మమ్మ మహిళా కళాశాల నూతన భవనాలను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ ఛైర్మన్ అసం రఘురామిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల కొండారెడ్డి పాల్గొన్నారు.