మరింత విషమంగా మాజీ ప్రధాని ఆరోగ్యం

మరింత విషమంగా మాజీ ప్రధాని ఆరోగ్యం

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియా ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. ఛాతీలోని ఇన్ఫెక్షన్ ఆమె గుండె, ఊపిరితిత్తులకు చేరడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న ఇంకా ఖలిదా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై ఆ దేశ అధ్యక్షుడు షహబుద్దీన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రజలందరూ ప్రార్థనలు చేయాలని కోరారు.