వరంగల్ బస్టాండ్‌లో మేడారం భక్తులు బారులు

వరంగల్ బస్టాండ్‌లో మేడారం భక్తులు బారులు

వరంగల్: మేడారం వనదేవతల జాతర ముగింపు దశకు చేరడంతో భక్తుల రద్దీ పెరిగింది. తల్లులు సాయంత్రం వనప్రవేశం చేయనున్న నేపథ్యంలో చివరి నిమిషంలో దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో మేడారం వైపు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఉదయం నుంచే ప్రయాణికుల తాకిడి కనిపించింది.