పొగాకు రైతులను ఆదుకోవాలి: AIKS

పొగాకు రైతులను ఆదుకోవాలి: AIKS

NLR: పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు కుర్రా వీరారెడ్డి డిమాండ్ చేశారు. కందుకూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. గతంలో గిట్టుబాటు ధరలు రాక నష్టాలపాలైన రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని ఆయన గుర్తు చేశారు. అలాంటి దుస్థితిని మరోసారి రానీయొద్దని అధికారులను కోరారు.