అసెంబ్లీకి వచ్చిన విద్యార్థులతో ముచ్చటించిన హోం మంత్రి

అసెంబ్లీకి వచ్చిన విద్యార్థులతో ముచ్చటించిన హోం మంత్రి

GNTR: అమరావతిలోని శాసనసభను సందర్శించిన 19 పాఠశాలలకు చెందిన విద్యార్థులతో ముచ్చటించడం ఆనందంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంచుకోవడానికి వచ్చిన చిన్నారుల కుతూహలం తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు. సభ విరామ సమయంలో విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.