'పేదల వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత'
NTR: పేదల వైద్యానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆదివారం విజయవాడలోని తమ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే సిఫారసు మేరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.6,11,000 సహాయం పేదలకు అందచేశారు.