మిత్రుని కుటుంబానికి ఆర్థిక సాయం
KMR: కోనా బాన్సువాడ జడ్పీహెచ్ఎస్ 2003-04 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థల్లో ఒకరైన జ్ఞానేశ్వర్ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. డోంగ్లి మండలం టక్లీ గ్రామంలో బాధిత కుటుంబ సభ్యులను శుక్రవారం పూర్వ విద్యార్థులు పరామర్శించారు. ఈ సందర్భంగా రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఫాహీం అజ్మత్, రాజు, నరేష్ గౌడ్, ఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు.