ప్రో కబడ్డీలో ఎంపికైన వ్యక్తికి సత్కారం

KKD: విశాఖపట్నంలో జరగనున్న ప్రో కబడ్డీ పోటీలకు ఎంపికైన జగ్గంపేట మండలం రామవరం అంబేద్కర్ కాలనీకి చెందిన జైరాజ్‌ను కూటమి నాయకులు ఆదివారం సత్కరించారు. ఈ క్రమంలో అతడికి బొకే అందజేసి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శ్రీను, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకుడు గంగాధర్ పాల్గొన్నారు.