నిండుకుండలా హిమాయత్ సాగర్.. ఈసీ వాగుకు జలకళ

నిండుకుండలా హిమాయత్ సాగర్.. ఈసీ వాగుకు జలకళ

HYD: హిమాయత్‌ సాగర్ జలాశయం గేట్లను తెరవడంతో ఈసీ వాగు వరద నీటితో కళకళలాడుతోంది. నాలుగు ప్రధాన గేట్ల నుంచి విడుదలైన వరద నీరు హిమాయత్ సాగర్, కిస్మత్ పూర్, బుద్వేల్, గ్రీన్ సిటీ, హైదర్ గూడ మీదుగా సంగం వద్ద మూసీ నదిలో కలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా వరదనీటితో నిండుగా ఉంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రాజేంద్రనగర్ పోలీసులు వాగుకు ఇరువైపులా బందోబస్తు ఏర్పాటు చేశారు.