టేకులపల్లిలో ముమ్మరంగా వాహన తనిఖీలు

BDK: టేకులపల్లి మండల కేంద్రమైన బోడు క్రాస్ రోడ్ సెంటర్‌లో గురువారం పోలీసులు వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. మావోయిస్టు పార్టీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు మొదలుకావడంతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను,టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, బోడు ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.