పద్మ అవార్డులు.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
2027 సంవత్సరానికి గానూ దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ కోసం కేంద్రం నామినేషన్లను ఆహ్వానిస్తోంది. ఈరోజు ప్రారంభమైన ఈ ప్రక్రియ జూలై 31 వరకు కొనసాగుతుంది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఎవరైనా నామినేట్ చేయవచ్చు. ఆసక్తి గల వారు 'రాష్ట్రీయ పురస్కార్' పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.