'ప్రజల ఆరోగ్యంతో దోబూచులాడుతున్న పాలకులు'
PPM: గత, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంతో దోబూచులాడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగల దాలినాయుడు ఆరోపించారు. ఇవాళ జిల్లా ఆసుపత్రి సమీపంలో నిర్మాణంలో ఉన్న మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. గత ఐదేళ్లుగా ఆసుపత్రి నిర్మాణ పనులు నత్త నడకన నడుస్తుండడాన్ని చూస్తుంటే జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా ఉందన్నారు.