జాతీయ ఆర్చరీ పోటీలకు విద్యార్థి ఎంపిక
NRML: కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామంలో ఉన్న జీయర్ గురుకులం విద్యార్థి జగన్ జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యాడని గురుకులం ప్రిన్సిపాల్ చక్రధర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో జగన్ మంచి ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. విద్యార్థి జగన్‌ను అందరూ అభినందించారు.