దీనదయాళ్ స్పర్శయోజన స్కాలర్షిప్ దరఖాస్తుల ఆహ్వానం

ATP: అనంతపురం తపాలా శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి దీనదయాళ్ స్పర్శయోజన స్కాలర్షిప్ పరీక్షకు ఆరు, తొమ్మిదో తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తపాలాశాఖ అనంతపురం డివిజన్ ఎస్పీ లక్ష్మన్న విద్యార్థులను కోరారు. గత సంవత్సరం కనీసం 60% మార్కులు సాధించిన వారికి రూ.6 వేల స్కాలర్షిప్ అందజేస్తారు. దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 16గా నిర్ణయించారు.