ఒకేరోజు 339అభివృద్ధి పనులు ప్రారంభం

ఒకేరోజు 339అభివృద్ధి పనులు ప్రారంభం

NLR: అభివృద్ధే ఆశ..ఆకాంక్ష అని నెల్లూరు రూరల్ నియోజకవర్గ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పునరుద్ఘాటించారు. రూ.41 కోట్లతో చేపట్టి.. చెప్పిన మాటకు కట్టుబడి 60రోజుల్లో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనులను ఈ నెల 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు. నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న తన కార్యాలయంలో అభివృద్ధి పనులు చేయకముందు..చేసిన తరువాత చిత్రాలను ప్రదర్శించారు.