'VRA లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి'
NDL: VRAలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్ బాబు డిమాండ్ చేశారు. శనివారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం RDO నాగ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. VRAలకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు ఏఐటీయూసీ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. నిరసనలో VRAలు పాల్గొన్నారు.