కొత్త విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వేయాలని స్థానికుల వినతి
కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం కొత్త కాలనీలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పోవడంతో రెండు సంవత్సరాల క్రితం తాత్కాలికంగా వేరే ట్రాన్స్‌ఫార్మర్ మీద విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. అయితే ఇన్నేళ్లు గడిచినా ఇప్పటివరకు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ వేయకపోవడంతో విద్యుత్ లో వోల్టేజీతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు అంటున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.