'సాంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్లు జరగాలి'
ATP: గుంతకల్లులోని ప్రభుత్వ ఖాజీ కార్యాలయంలో ఉమ్మడి అనంతపురం జిల్లాల ప్రభుత్వ ఖాజీలు ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ ఖాజీలు మాట్లాడుతూ.. నిఖా కేవలం ఇస్లామియా పద్ధతిలో సాంప్రదాయంగా జరపాలన్నారు. ఫ్యాషన్ పెళ్లిలకు దూరంగా ఉండాలని నిజమైన దైవ బంధాన్ని అనుసరించాలని వారు విజ్ఞప్తి చేశారు.