VIDEO: నార్సింగ్ మండల కేంద్రంలో అగ్నిప్రమాదం
MDK: గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగి ఒక నివాస గుడిసె దగ్ధమైన ఘటన నార్సింగ్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన మానవళి రవి అనే వ్యక్తికి చెందిన నివాస గుడిసెలో శుక్రవారం నివాస గుడిసె దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న రెండు లక్షల ఇరవై వేల నగదు, అర తులం బంగారం, బట్టలు, నిత్యవసర సరుకులు కాలిపోయాయి.