VIDEO: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సివిల్ కోర్ట్ న్యాయమూర్తి
E.G: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అనపర్తి జూనియర్ సివిల్ కోర్ట్ ప్రాంగణంలో న్యాయమూర్తి ఎన్.రెడ్డి ప్రసన్న శుక్రవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని ఆమె పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలన్నారు.