ఆ 450 కిలోల యురేనియం ఇచ్చేయాలి: ట్రంప్
కాల్పుల విరమణ కోసం ఇరాన్‌కు కొన్ని షరతులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పంపినట్లు తెలుస్తోంది. 'ఇరాన్ తనకున్న అణుసామర్థ్యాలను తప్పనిసరిగా నిర్వీర్యం చేయాలి. నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్దో అణు కేంద్రాలను ధ్వంసం చేయాలి. ఇరాన్ తన వద్ద నిల్వ ఉంచుకున్న 450 కిలోల యురేనియంను ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి అప్పగించాలి' అని షరతులు విధించినట్లు సమాచారం.