బాలకృష్ణ అంటే ఓ శక్తి: ఆది

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'అఖండ 2: తాండవం'. తాజాగా నటుడు ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ''బాలకృష్ణ అంటే ఒక శక్తి'. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం గొప్ప అనుభవం. షూటింగ్ సమయంలో బాలకృష్ణ ఇచ్చే సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ చిత్రంలో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. బాలకృష్ణతో చేసే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి' అని వెల్లడించారు.