WWC Final: సౌతాఫ్రికాపై భారత్‌దే పైచేయి
ఉమెన్స్ వరల్డ్ కప్ టైటిల్ పోరులో ఇవాళ భారత్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. సొంత మైదానం, ప్రజల మధ్య ఆడుతున్న హర్మన్ సేనకు గత రికార్డులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అటు సౌతాఫ్రికాతో ఇప్పటివరకు జరిగిన 34 మ్యాచుల్లో భారత్ 20-13తో ఆధిపత్యం చెలాయిస్తోంది. కాగా ఈ మ్యాచులో ఏ టీమ్ గెలిచినా తొలిసారి ప్రపంచ విజేతగా నిలుస్తుంది.