గుంటూరు మీదుగా ప్రత్యేక రైలు
GNTR: వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలు సేవలు ప్రారంభమవుతున్నాయి. చర్లపల్లి-తిరుచ్చిరాపల్లి ప్రత్యేక రైలు ఈ నెల 14 నుంచి జూన్ 2 వరకు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి మంగళవారం గుంటూరు మీదుగా సర్వీసు ఉంటుందన్నారు. నడికూడి, సత్తెనపల్లి, తెనాలి, బాపట్ల, చీరాల స్టేషన్లలో నిలుస్తుందని, తిరుగు ప్రయాణంలో తిరుచ్చిరాపల్లి-చర్లపల్లి రైలు ఈ నెల 15 నుంచి జూన్ 3 వరకు నడుస్తుందన్నారు.