పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్

కోనసీమ: ఆత్రేయపురం మండలం నార్కేడ్ మిల్లిపాలెం గ్రామ శివారున పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ. 22,500 నగదు స్వాధీనపరచుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు ఆత్రేయపురం ఎస్సై రాము తెలిపారు. మండలంలో ఎవరైనా ఆసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.