'పీఎం-శ్రీ నిధులతో వంటశాల భవనాన్ని నిర్మించాలి'
WGL: సంగెం మండలం గవిచెర్లలొని ఆదర్శ పాఠశాలను ఇవాళ జిల్లా అదనుపు కలెక్టర్ జి. సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కిచెన్ గార్డెన్‌ను పరిశీలించి విద్యార్థులకు అందించే కోడిగుడ్లను బరువును తూకం వేసి చూశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పీఎం-శ్రీ నిధులతో పాఠశాలలో వంటశాల భవనాన్ని నిర్మించాలని అధికారులను ఆదేశించారు.