బీమా సొమ్ము కోసం స్కెచ్.. ఇద్దరి అరెస్ట్
ASR: ఎటపాక మండలం గన్నవరంకు చెందిన యశ్వంత్ పేరిట ఉన్న రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భద్రాచలానికి చెందిన సాయిదీపక్, భానుప్రకాశ్ హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ నెల 14న పట్టినగర్ వద్ద యశ్వంత్‌పై దాడి చేయగా, స్థానికులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ మంగళవారం వెల్లడించారు.