ఉప సర్పంచ్‌గా భూపతి ఏకగ్రీవ ఎన్నిక

ఉప సర్పంచ్‌గా భూపతి ఏకగ్రీవ ఎన్నిక

MNCL: జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ ఉపసర్పంచ్‌గా చెట్పల్లి భూపతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూపతి ఆ గ్రామ పంచాయతీలోని పదవ వార్డు నుండి వార్డు సభ్యునిగా గెలుపొందారు. దీంతో గ్రామ సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం భూపతిని గ్రామ ఉపసర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేండ్లగూడ గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.